కోర్టులో నే చంద్రబాబు పెళ్లిరోజు.. ఇక అదే రోజు రిమాండ్

కోర్టులో నే చంద్రబాబు పెళ్లిరోజు.. ఇక అదే రోజు రిమాండ్

యాదృశ్చికమో.. కర్మ ఫలితమో.. కొన్ని కొన్ని సంఘటనలు జరిగేతీరు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తాజాగా చంద్రబాబు  వ్యవహారంలో ఇదే జరిగింది.సెప్టెంబరు 10న చంద్రబాబు, భువనేశ్వరిల పెళ్లి రోజు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో శనివారం  ( సెప్టెంబర్ 9) ఉదయం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.   అనంతరం ఆదివారం  ( సెప్టెంబర్ 10 ) ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో పెళ్లిరోజు నాడే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారు

చంద్రబాబు నాయుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న పేరు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? ఇదే రోజు అంటే సెప్టెంబర్ 10న చంద్రబాబు నాయుడి పెళ్లి జరిగింది. 1981 సెప్టెంబర్ 10న చెన్నై(అప్పటి మద్రాస్)లో చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి లకు వివాహం జరిగింది.

సెప్టెంబరు 10న చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజు. ఆ రోజు ఇద్దరూ కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నారు. కానీ... అందుకు ముందు రోజునే సీఐడీ  అధికారులు చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. దీంతో ఆరోజు భువనేశ్వరి ఒక్కరే అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ఆ తరువాత  భువనేశ్వరి కూడా కోర్టుకు వెళ్లారు.  బాబుకు బెయిల్ వస్తుందని ఆశించినప్పటికీ.. కోర్టు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో... భువనేశ్వరి భావోద్వేగానికి  గురయ్యారు. కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు ఆమెను సముదాయించి ధైర్యం చెప్పారు.